calender_icon.png 11 December, 2025 | 11:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నెహ్రును తలపించేలా రేవంత్‌రెడ్డి నిర్ణయాలు

11-12-2025 12:34:22 AM

పీసీసీ మాజీ అధ్యక్షుడు వీహెచ్ 

హైదరాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): రాష్ట్ర అభివృద్ది విషయంలో ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి దూరదృష్టితో ముందుకెళ్లుతున్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు అన్నారు. ఒక వైపు అభివృద్ధ్ది, సంక్షేమంతో పాటు రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడంలో సీఎం చేస్తున్న కృషి దూరదృష్టికి నిదర్శనమన్నారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ గ్లోబల్ సమ్మిట్ విజ యవంతం కావడం, ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి తీసుకున్న కార్యాచరణ చాలా మంచి నిర్ణయమన్నారు.

నెహ్రూ కాబినెట్‌లో బడుగు బలహీన వర్గాలకు అవకాశాలు కల్పించారని, ఇప్పుడు సీఎం రేవం త్‌రెడ్డి కూడా నెహ్రూని తలపించేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. సర్కా ర్ స్కూల్‌లో చదివిన సీఎం రేవంత్‌రెడ్డి ఒక విజన్‌తో గ్లోబల్ సమ్మిట్‌ని ఏర్పాటు చేశారన్నారు. ఎస్సీ , బీసీ హాస్టల్స్ కి సెపరేట్ కాకుండా అందరికీ సమాంతర విద్య అందించటానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్, స్కిల్ డెవలప్ మెంట్ స్కూల్ ఏర్పాటు చేశారన్నారు. రేవంత్‌రెడ్డి మాత్రం సంపద సృష్టించి అందరికి న్యాయం జరిగే దిశగా పాలన చేస్తున్నారని చెప్పారు.