11-12-2025 12:36:48 AM
అదుపు తప్పి బోల్తా పడడంతో దుర్ఘటన
ఆదిలాబాద్ జిల్లా తర్నం వద్ద ఘటన
మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే, మాజీ మ్రంతి
ఆదిలాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి) : ఆదిలాబాద్ జిల్లాలోని ముగ్గురు కార్మికుల కుటుంబంలో ఆ రాత్రి కాలరాత్రిగా మిగిలిపోయింది. జిల్లాలో జరిగిన ఘో ర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఆదిలాబాద్ పట్టణంలోని జై జవాన్ నగర్‌కు చెందిన గౌస్ మొయినుద్దీన్, షేక్ మొహిన్, కీర్తి సాగర్, యోగేష్ లు భవన నిర్మాణ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
మహారాష్ట్రలోని వణి పట్టణంలో జరుగుతున్న పనులను ముగించుకుని సాయం త్రం కారులో ఆదిలాబాద్‌కు బయలుదేరా రు. ఈ క్రమంలో గత అర్ధరాత్రి దాటక ఉమ్మడి జైనథ్ మండలంలోని తర్నం గ్రామం వద్ద జాతీయ రహదారిపై మూలమలుపు వద్ద అతివేగంతో వస్తున్న కారు అదు పుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ ఘటనలో గౌస్ మొయినుద్దీన్, షేక్ మొహి న్, కీర్తి సాగర్ అక్కడికక్కడే మృతి చెందగా, యోగేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు గాయపడ్డ వ్యక్తిని రిమ్స్ కు తరలించారు. ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది.
మృతులంతా ఒకే కాలనీకి చెందినవారు కావడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాద విష యం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే పాయ ల్ శంకర్, మాజీ మంత్రి జోగు రామన్న రిమ్స్ ఆసుపత్రికి వెళ్లి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు జైనథ్ ఎస్‌ఐ గౌతం పవర్ తెలిపారు.