calender_icon.png 4 August, 2025 | 4:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రిలియంట్ లో గ్రీన్ డే

03-08-2025 12:56:50 AM

బూర్గంపాడు,(విజయక్రాంతి): మండలంలోని సారపాక బ్రిలియంట్ విద్యాసంస్థల నందు ప్రీ ప్రైమరీ విద్యార్థులు గ్రీన్ డే నీ నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రిలియంట్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ బిఎన్ఆర్ మాట్లాడుతూ.. గ్రీన్ డే అంటే కేవలం రంగును గుర్తించడమే కాదు ప్రకృతి పర్యావరణాన్ని గుర్తుచేస్తూ మానవ  జీవన మనుగడలో చెట్లు మొక్కలు పెంచడం ఎంత అవసరమని అన్నారు.నేటి కాలంలో పర్యావరణాన్ని కాపాడుకోవడం వలన ప్రకృతిపై మనకున్న ప్రేమను బాధ్యతను తెలియజేస్తుందని పేర్కొన్నారు.

ఆకుపచ్చని రంగులలో విద్యార్థులు ఫ్లకార్డ్స్ తో కొన్ని ప్రదర్శనలు చేసి అందరినీ  అబ్బుర పరిచారు.చెట్లు మొక్కలు ,ప్రకృతి మనకు స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారాన్ని అందించడమే కాదు మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుందని, పర్యావరణాన్ని కాపాడడం మన అందరి బాధ్యత అని చిన్నారులు ఆటపాటలతో ఎంతో అద్భుతంగా తెలియజేశారు .ఈ సందర్భంగా విద్యార్థులకు సరదాగా ఆటలు నిర్వహించి వారి ఆనందానికి ఉత్సాహం ఇచ్చారు.