09-07-2025 12:10:48 AM
తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ
ముషీరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ హామీ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం దాటవేత వైఖరిపై నిరసిస్తూ ఆగస్టు 19న కామా రెడ్డిలో లక్ష మంది బీసీలతో బీసీల సింహగర్జన నిర్వహించనున్నట్లు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వెల్లడించింది.
ఈ మేరకు మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానించి, కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించి చేతులు దులుపుకుందని ఆరోపించారు. సీఎం రేవం త్ రెడ్డి అనేక అనేకమార్లు ఢిల్లీ వెళ్లి బీసీ రిజర్వేషన్ల గురించి ప్రస్తావించకపోవడం శోచనీ యం అన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కాంగ్రెస్‌కి తగిన బుద్ధి చెప్తామని ఎర్ర సత్యనారాయణ హెచ్చరించారు. నాయకులు కోలా జనార్దన్, సుధాకర్, నంద గోపాల్, ఉదయ్, బోయ గోపి పాల్గొన్నారు.