23-01-2026 12:24:09 AM
డర్బన్, జనవరి 22 : టీ20 ప్రపంచకప్ ఆరంభానికి ముందు గాయాలు వెంటాడుతుండడంతో దక్షిణాఫ్రికా జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గాయాలతో ఫెరీరా, డి జోర్జి మెగాటోర్నీకి దూరమ య్యారు. దీంతో వీరిద్దరి స్థానాల్లో ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్ ను ఎంపిక చేశారు. డి జోర్జి భారత పర్యటనలో గాయపడ గా... ఫెరీరా సౌతాఫ్రికా టీ20 లీగ్ ఆడుతూ గాయపడ్డాడు. వీరిద్దరూ విండీస్‌తో సిరీస్‌తో పాటు ప్రపంచకప్‌కు దూరమయ్యారు.
ముం దు జట్టు ఎంపికలో వీరిద్దరినీ తీసుకోకపోవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు గాయాలతో దూరమైన ఆటగాళ్ల జాబితాలో వీరిని తీసుకోవడానికి వారి ఫామే కారణం. ఎస్‌ఏ20 లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రికెల్టన్ గత వారం కేవలం 60 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఓవరాల్‌గా ఈ సీజన్‌లో 42కు పైగా సగటుతో 337 రన్స్ చేశాడు. అటు స్టబ్స్ గత కొంతకాలంగా ఫామ్‌లో లేకపోయినప్పటకీ భారత్ పిచ్‌లపై ఐపీఎల్‌లో ఆడిన అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని సఫారీలు భావిస్తున్నారు.