calender_icon.png 22 September, 2025 | 6:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇళ్ల మంజూరిలో అధికార పార్టీ నేతల చేతివాటం

22-09-2025 05:06:59 PM

10వేలు వసూలు మరో 15వేలు ఇవ్వాలని ఒత్తిడి.                 

ఇవ్వకపోవడంతో దాయాది వద్ద అడ్డుపుల్ల. 

మీడియా ముందు బాధితురాలి గోడు.

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం సిర్సవాడ గ్రామంలోని ఓ మహిళ నుండి ఇందిరమ్మ ఇల్లు మంజూరి పేరుతో అధికార పార్టీ నేత డబ్బులు వసూళ్లకు పాల్పడ్డాడు. 25 వేలు ఇస్తేనే మంజూరు అవుతుందని చెప్పడంతో అప్పుచేసి పది వేలు ఇచ్చిన సదరు లబ్ధిదారు బేస్మెంట్ లెవెల్ వరకు నిర్మించగా మరో 15వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆ 15వేలు ఇవ్వలేకపోవడంతో దయాధుల వద్ద షేర్ సందు పంచాయతీ పెట్టించి నిర్మాణాన్ని అడ్డుకున్నాడు.   వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన ఏదుల భీమమ్మ, భర్త విష్ణువర్ధన్ లు పొట్టకూటి కోసం ఆంధ్ర వలస వెళ్లారు.

కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తుండడంతో  అర్హత గల ఆ మహిళ నుండి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం అదే మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ లీడర్ తన వద్ద డబ్బులు డిమాండ్ చేశాడు. ఇరుగుపొరుగు వారి నుండి 10 వేలు అప్పు చేసి మరి ఇచ్చినట్లు వాపోయింది. తీరా బేస్మెంట్ లెవెల్ నిర్మాణం పూర్తయ్యాక తమ కుటుంబంలో జరిగిన గొడవ కారణంగా నిర్మాణం ఆగిపోయింది ఈ క్రమంలోనూ సదరు కాంగ్రెస్ నాయకుడు వారికే మద్దతుగా నిలిచి తమ ఇంటి నిర్మాణానికి మిగతా డబ్బులు ఇవ్వలేదన్న అక్కస్సుతో అడ్డు తగులుతున్నాడని ఆరోపించారు.