29-11-2025 12:58:15 AM
అధికారుల్లో మొదలైన గుబులు
బెల్లంపల్లి అర్బన్, నవంబర్ 28 : సింగరేణిలో అధికారుల్లో తిష్ట వేసిన అధికార దుర్వినియోగం, పనితీరులో చోటుచేసుకున్న అక్రమ విధానాల గుట్టురట్టు సింగరేణిలో కలంకలం రేపుతుంది. తమకె దురెవరనే విర్రవీగుడు తనానికి ‘విజయక్రాంతి’ సంచలన వార్త కథనంతో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ‘ఎస్డీఎల్ గుత్తేదారు పెద్దసా రే...’ అనే శీర్షికతో ‘విజయక్రాంతి’ దినపత్రికలో ఈ నెల 27న ప్రచురితమైన సంచలన కథనం సింగరేణి అధికారుల గుం డెల్లో ఒక్కసారి గుబులు రేపినట్టయింది. ఈ కథనంపై కార్మిక లోకం నుంచి ప్రశంస, స్పందనలు వెల్లువెత్తాయి.
గుట్టు చప్పుడుగా అధికారులు చేస్తున్న కాంట్రాక్టు వ్యవహారం వెలుగులోకి రావడం ప్రస్తుతం సింగరేణిలో హాట్ టాపిక్ అయింది. ఎస్డీఎల్ కాంట్రాక్టర్ వ్యవహారం వెలుగులోకి వచ్చి సింగరేణి అధికార యంత్రాంగం నైతికతకు మచ్చగా మారిం ది. గూడుపుఠాణిగా జరిగిన ఓ అధికారి ఎస్డిఎల్ కాంట్రాక్టు వైనం సింగరేణినీ రచ్చకె క్కించింది. ఈ ఉదాంతంపై సింగరేణి విజిలె న్స్ అధికారులు స్పందించారు.
హుటా హుటినా రంగంలోకి దిగారు. సింగరేణిలో ఎస్డీఎల్ కాంట్రాక్ట్ వ్యవహారంపై నిగ్గుతెల్చేందుకు విచారణ మొదలుపెట్టారు. ఎస్డీఎల్ గుత్తేదారులో ఎవరెవరు భాగస్వాములు ఉన్నారు, కాంట్రాక్టులో ఎవరి వాటా ఎంత, ఎప్పటి నుంచి ఉన్నారనే దానిపై విజిలెన్స్ అధికారులు సమాచారం సేకరించే పనిలో పడ్డా రు. కాంట్రాక్టు వ్యవహారంలో గోప్యమైన ఈ విషయం ఎలా బయటకు ఎలా పొక్కిందనే విషయంపై విజిలెన్స్ అధికారులు క్షేత్ర స్థాయి నుంచి విచారణ మొదలు పెట్టారు. విజిలెన్స్ అధికారులు శాంతిఖని గనికి కూడా వెళ్ళి ఆరా తీశారని సమాచారం.
ఎస్డీఎల్ గుత్తేదారులను కూడా కలిసినట్లు తెలుస్తోంది. విచారణకు విఘాతం కలగకుండా, తమ కదలికలను బయటకు తెలియ నీయకుండా, గుత్తేదారులను కలిసిన విషయా న్ని బయటకు పొక్కకుండా చాలా గోప్యంగా ఉంచుతున్నారు. ఎస్ డీఎల్ కాంట్రాక్టు వ్యవహారంలో నిజాలను నిగ్గుతేల్చేందుకు చేపట్టిన విజిలెన్స్ విచారణ న్యాయతీరాన్ని చేరుతుందా ..? లేదా ఉన్నతాధికారుల పలుకుబ డి ముందు లొంగుతుందా అన్న దానిపై సింగరేణి కార్మిక లోకం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుంది. రంగంలోకి విజిలెన్స్ అధికారులు దిగడంతో మరోవైపు అధికారుల్లో గుబులు మొదలైంది.