05-11-2025 05:08:35 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన యు.రామకృష్ణ అనే వైద్యులు రాష్ట్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శిగా ఎన్నిక కావడంతో బుధవారం నిర్మల అయ్యప్ప ఆధ్వర్యంలో రామకృష్ణకు శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ వైద్యులు మురళీధర్ డాక్టర్ చక్రధరి దేవేందర్ రెడ్డి కృష్ణంరాజు సురేష్ సంతోష్ తదితరులు ఉన్నారు.