calender_icon.png 17 August, 2025 | 5:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైక్‌ను ఢీకొట్టిన అంబులెన్స్.. ఒకరు మృతి

10-07-2024 03:25:59 PM

చర్లపల్లి: మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చర్లపల్లి బీఎన్ రెడ్డి కాలనీ వద్ద బైక్ పై ప్రయాణిస్తున్న దంపతులను అధిక వేగంతో వచ్చిన అంబులెన్స్ వెనుక నుంచి ఢీకోట్టింది. ఈ ప్రమాదంలో భర్త (రాజిరెడ్డి) అక్కడికక్కడే మృతి చెందగా, భార్య (తులసి)కి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఆమెను స్థానికులు చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని శవ పరీక్ష నిమిత్తం మార్చరీకి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.