calender_icon.png 10 January, 2026 | 11:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదాలను నివారించాలి

10-01-2026 12:13:10 AM

 హయత్ నగర్ సీఐ నాగరాజు గౌడ్ 

ఎల్బీనగర్, జనవరి 9 : అప్రమత్తతతోనే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమని, రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని హయత్ నగర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్   నాగరాజు గౌడ్ పిలుపునిచ్చారు. ప్రమాదాల నివారణలో రోడ్డు నిబంధనలు పాటిస్తూ, క్రమశిక్షణతో డ్రైవింగ్ చేస్తే ప్రమాదాలు జరగవని సూచించారు.  జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా  శుక్రవారం హయత్ నగర్ బస్టాండ్ లో రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇటీవల  రోడ్డు ప్రమాదాల రేటు  పెరగడం ఆందోళన కరమని, ప్రమాదాల్లో ఎక్కువ శాతం మితిమీరిన వేగం, సెల్ ఫోన్ డ్రైవింగ్, నిద్ర మత్తులో, ఓవర్ టేకింగ్, రోడ్ల పై అవగాహన లేకపోవడంతో జరుగుతున్నాయని తెలిపారు.  కార్యక్రమంలో హయత్ నగర్ ఆర్టీసీ డిపో -1 డిపో మేనేజర్ జలగం విజయ్, సహాయ ఇంజినీర్ సురేందర్, డ్రైవర్, కండక్టర్లు పాల్గొన్నారు.