10-01-2026 12:14:53 AM
కాగజ్ నగర్, జనవరి 9(విజయ క్రాంతి): సిర్పూర్ పేపర్ మిల్లులో కార్మిక సంఘాల గుర్తింపునకు జరగాల్సిన సీక్రెట్ బ్యాలెట్ ఎన్నికలను అడ్డుకునేందుకు మిల్లు యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. అయితే సిర్పూర్ పేపర్ మిల్స్ మజ్దూర్ యూనియన్ (E2510) సీఐటీయూ వెంటనే కౌంటర్ పిటిషన్ దాఖలు చేయగా, హైకోర్టు యాజమాన్యం వేసిన పిటిషన్ను శుక్రవారం కొట్టివేసింది. ఇది కార్మికుల విజయమని యూనియన్ జనరల్ సెక్రటరీ కూశన రాజన్న తెలిపారు.
కార్మికుల తరఫున బలమైన వాదనలు వినిపించిన అడ్వకేట్ అబీద్ హుస్సేన్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ముంజం శ్రీనివాస్. నీలి రాజన్న. అంగల శ్రీనివాస్. రామ్ శెట్టి రాజన్న.పులి భూమయ్య. బషీర్. ముంజం ఆనంద్ కుమార్. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు త్రివేణి ,రాష్ట్ర కార్యదర్శి సుధాకర్, జిల్లా కార్యదర్శి జాదవ్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.