calender_icon.png 10 January, 2026 | 11:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చైనా మాంజా, లక్కీ లాటరీలు నిర్వహిస్తే కఠిన చర్యలు

10-01-2026 12:11:58 AM

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

ఆదిలాబాద్, జనవరి 9 (విజయక్రాంతి):  సంక్రాంతి పండగ సందర్భంగా చైనా మాంజా వాడటం గాని, సంక్రాంతి సందర్భంగా లక్కీ డ్రా లు, పేకాటలు, ఆసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరంలో జిల్లా పోలీసు అధికారులతో నెలవారి నీరసమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు కాజల్ సింగ్, సురేందర్ రావు, ఏఎస్పీ అడ్మిన్ మౌనిక, శిక్షణ ఐపిఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.