15-10-2025 12:26:29 AM
రాకపోకలకు ఇబ్బందులు
వెల్దండ అక్టోబర్ 14: మండల కేంద్రం నుంచి సిరిసనగండ్ల రోడ్డు మరమ్మతులకు నోచుకోవడం లేదు. గ్రామ సమీపంలో రోడ్డుపై గుంతలు ఏర్పడి వివిధ గ్రామాలకు ప్రజలు వానచోదకులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతినిత్యం ఈ రహదారిపై కస్తూర్బా, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆదర్శ పాఠశాల, గుండాల ఏకలవ్య గురుకుల పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ఉపాధ్యాయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
బైరాపూర్, చెదురువెల్లి, బొల్లంపల్లి, చల్లపల్లి, అజిలాపూర్, గ్రామాలకు తండాలకు వెళ్లే ప్రయాణికులు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు మరమ్మతులు చేపట్టి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేయాలని ప్రజలు కోరుతున్నారు.