15-10-2025 12:37:59 AM
హైదరాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించి మళ్లీ గులాబీ జెండా ఎగురవేస్తామని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు ఆయన మంగళవారం ఎర్రవెళ్లిలోని తన వ్యవసాయ క్షేత్రలో బీ ఫామ్‌తో పాటు ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ తరపున రూ. 40 లక్షల చెక్కు అందజేశారు.
బీఆర్‌ఎస్ అభ్యర్థి సునిత వెంట ఆమె కూతుళ్లు, కుమారుడుతో పాటు ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, పద్మారావుగౌడ్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్‌రావు, పార్టీ నేతలున్నారు. కాగా, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే.
ఈ ఉప ఎన్నికను బీఆర్‌ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని సిట్టింగ్ స్థానానని దర్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే మాగంటి గోపినాథ్ భార్య సునితకు పార్టీ టికెట్ ఇచ్చింది. గోపినాథ్ మీద సానుభూతితో విజయం సాధిస్తామని బీఆర్‌ఎస్ పార్టీ అంచనా వేస్తోంది.