22-01-2026 02:44:47 PM
కరీంనగర్ క్రైం,(విజయ క్రాంతి): రోడ్ సేఫ్టీపై “మీడియా అవుట్‌రీచ్ డే” కార్యక్రమంలో భాగంగా అక్షయ డిగ్రీ కాలేజీలో ఎస్‌ఐ వి శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. రోడ్ సేఫ్టీ నిబంధనలు, బాధ్యతాయుత ప్రవర్తనపై ప్రజల్లో, ముఖ్యంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, రోజువారీ రోడ్డు వినియోగదారులలో అవగాహన పెంపొందించడం, రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రయాణికులకు సురక్షిత రహదారి మార్గాన్ని కల్పించడం వంటి అంశాలపై వివరించారు. మద్యం సేవించి వాహనం నడపవద్దని, ట్రాఫిక్ నియమాలు పాటిస్తేనే ప్రాణాలు కాపాడబడతాయని, ప్రతిసారి హెల్మెట్, సీటుబెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ ఉపయోగించకూడదని, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ ప్రమాదకరమని, పాదచారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, రాంగ్ రూట్‌లో వాహనాలు నడపవద్దని, వాహనాలపై పెండింగ్ చలాన్లను క్రమం తప్పకుండా తనిఖీ చేసి చెల్లించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.