calender_icon.png 22 January, 2026 | 4:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూమి కోసం న్యాయపోరాటం

22-01-2026 02:43:33 PM

తహసీల్దార్ కార్యాలయం ఎదుట బాధితుడి నిరసన 

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఓ వ్యక్తి తన భూమికి న్యాయం జరగాలని కోరుతూ నిరసనకు దిగాడు. లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన బాధితుడు, తన భూమిని మాజీ సర్పంచ్ అక్రమంగా కబ్జా చేశారని ఆరోపించాడు.

కోర్టు తీర్పు తనకు అనుకూలంగా ఉన్నప్పటికీ, ఆ తీర్పును లెక్కచేయకుండా భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తన భూమిని రక్షించడంతో పాటు న్యాయం చేయాలని అధికారులను కోరుతూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బేటాయించాడు. ఘటన తంగళ్ళపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో చోటుచేసుకోగా, విషయం తెలుసుకున్న స్థానికులు సంఘటనపై ఆసక్తి చూపుతున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని బాధితుడు విజ్ఞప్తి చేశాడు.