02-01-2026 12:00:00 AM
ములకలపల్లి / దమ్మపేట, జనవరి 1,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రా మంలో గురువారం అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ క్యాం ప్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. క్యాంపు కార్యాలయం శుభాకాంక్షలు,అభినందనలతో ఉత్సాహంగా కోలాహాలంగా మారింది. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ నియోజకవర్గ వ్యాప్తం గా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ సర్పంచులు, పార్టీ కార్యకర్తలు, ఐదు మండలాలకు చెందిన వివిధ శాఖల అధికారులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో క్యాంప్ కార్యాలయానికి తరలివచ్చారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.
నూతన సంవత్సర శుభాకాంక్షల కా ర్యక్రమం ఉదయం నుంచే ప్రారంభమై రోజంతా కొనసాగింది. క్యాంప్ కార్యాలయంలోకి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు ఆత్మీయంగా ఆహ్వానిస్తూ శుభాకాంక్షలు స్వీకరించారు. ఈ సందర్భంగా నాయకులు పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో సత్కరించి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.ని యోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే జారె ఆదినారాయణ చేపడుతున్న కార్యక్రమాలను కొనియాడుతూ, గత ఏడాదిలో అమలైన అనేక అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుకు ఆయన చేసిన కృషిని ప్రశంసించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, త్రాగునీటి సమస్యల పరిష్కారం, రహదారుల అభివృద్ధి, విద్య, వైద్య రంగాల్లో చేపట్టిన చర్యలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మె ల్యే జారె ఆదినారాయణ గారు మాట్లాడు తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశా రు. ప్రజల నమ్మకం, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికార యంత్రాంగం సమన్వయంతోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ ్యమని కొత్త సంవత్సరంలో ప్రజల సంక్షేమ మే లక్ష్యంగా పని చేస్తూ, ప్రతి గ్రామం, ప్రతి వర్గానికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు.అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ శ్రేణు లు అందరూ కలిసి పనిచేస్తే అశ్వారావుపేట నియోజకవర్గం మరింత అభివృద్ధి దిశగా పయనిస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడు తూ, రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, ఎమ్మెల్యే నాయకత్వంలో నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు.ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు తెలిపారు. ప్రజలకు వాస్తవ సమాచారాన్ని చేర వేయడంలో మీడియా పాత్ర ఎంతో కీలకమని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పేర్కొంటూ మీడియా ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.