calender_icon.png 12 July, 2025 | 2:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌లో రోడ్ సేఫ్టీ స్పెషల్ డ్రైవ్

12-07-2025 12:00:00 AM

ప్రారంభించిన జీహెచ్‌ఎంసీ

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 11 (విజయక్రాంతి): వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని నగరంలోని రోడ్లపై ట్రాఫిక్‌కు ఆటంకం కలగకుండా చూడటమే లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ ఇంటెన్సివ్ మెయింటెనెన్స్ డ్రైవ్‌ను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్ (మెయింటెనెన్స్) విభాగం ఆధ్వర్యంలో 7500 ప్రాంతాలలో గుర్తించిన బీటీ, సీసీ రోడ్లపై పాట్‌హోల్స్ ఫిల్లింగ్, క్యాచ్ పిట్స్ మరమ్మతులు, సెంట్రల్ మీడియన్లలో మైనర్ రిపేర్లు తదితర పనులను వేగవంతంగా చేపట్టారు.

చీఫ్ ఇంజినీర్ సహదేవ్ రత్నాకర్ శుక్రవారం ఎర్రమంజిల్ ప్రధాన రహదారిపై జరుగుతున్న మరమ్మత్తు పనులను పరిశీలించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాల మేరకు నగరంలోని వాహనదారులకు రహదారులపై సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మరమ్మతు పనులు వారం లోపు పూర్తి చేయాలనే లక్ష్యంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం అని తెలిపారు.