23 June, 2026 | 12:52 AM

ఇసుక లారీల అడ్డాగా రోడ్డు

23-06-2026 12:08 AM

రెండు గంటలపాటు రద్దీలో అంబులెన్స్ 

సకాలంలో వైద్యం అందక వ్యక్తి మృతి 

భద్రాద్రి జిల్లా సాంబయిగూడెంలో ఘటన

మణుగూరు, జూన్ 22 (విజయక్రాంతి): భద్రాద్రి జిల్లా సాంబయిగూడెంలో మణుగూరు ప్రధాన రహదారి ఇసుక లారీల అడ్డాగా మారింది. నిత్యం వందల సంఖ్యలో లారీలు నిలుపుతుండటంతో భారీ గా రద్దీ ఏర్పడుతుంది. సోమవారం కూడా భారీగా రద్దీ ఏర్పడటంతో ఓ అంబులెన్స్ రెండు గంటలపాటు చిక్కుకుంది.

దీంతో స కాలంలో సకాలంలో వైద్యం అందక యువకుడు మృతి చెందాడు. సోమవారం మండ లంలోని సాంబాయిగూడెం వద్ద ప్రధాన రహదారిని ఇసుక లారీలు దిగ్బంధం చేశాయి. దమ్మక్కపేట గ్రామానికి చెందిన వంశీ పురుగుల మందు తాగడంతో అంబులెన్సులో ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. అయి తే సాంబాయిగూడెం నుంచి రామానుజవ రం వరకు రహదారిపై ఇసుక లారీలు అడ్డం గా నిలిపివేయడంతో అంబులెన్స్ ముందు కు వెళ్లలేకపోయింది.

కుటుంబ సభ్యులు వంశీని అంబులెన్స్ నుంచి దించి భుజాలపై మోసుకుంటూ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అరగంట ముందు ఆసుపత్రికి తీసుకొచ్చి ఉంటే ప్రాణాలు కాపాడే అవకాశం ఉండేదని వై ద్యులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. రహదారిని దిగ్బంధం చేసిన ఇసుక లారీల కారణంగానే వంశీ ప్రాణాలు కోల్పోయాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులు, పోలీసు శాఖ  స్పందించి ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.