calender_icon.png 23 November, 2025 | 10:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కెప్టెన్‌గా రోహిత్ శర్మ

26-01-2025 12:06:30 AM

ఐసీసీ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ 

టీ20 ఉత్తమ క్రికెటర్‌గా అర్ష్‌దీప్

దుబాయ్: గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ సారధ్యంలోని భారత జట్టు 17 ఏళ్ల తర్వాత రెండోసారి టీ20 ఫార్మాట్‌లో చాంపియన్‌గా నిలిచింది. ఈ క్రమంలో శనివారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2024 ఏడాదికి గానూ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ జట్టును ప్రకటించింది. కెప్టెన్‌గా రోహిత్ శర్మను ఎంపిక చేసిన ఐసీసీ జట్టులో రోహిత్ సహా నలుగురు భారత ఆటగాళ్లకు చోటు కల్పించింది. హిట్‌మ్యాన్‌తో పాటు స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, పేసర్ అర్ష్‌దీప్ ఎంపికయ్యారు. ఐసీసీ ప్రకటించిన జట్టులో భారత్ నుంచి నలుగురు, ఆసీస్, పాక్, విండీస్, జింబాబ్వే, అఫ్గానిస్థాన్, శ్రీలంక, ఇంగ్లండ్ నుంచి ఒక్కొక్కరు చోటు దక్కించుకున్నారు.  ఇక ఐసీసీ టీ20 ఉత్తమ క్రికెటర్‌గా ఆఫ్ ది ఇయర్‌గా భారత బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ నిలిచాడు. గతేడాది 18 టీ20ల్లో 36 వికెట్లు పడగొట్టిన అర్ష్‌దీప్ టీ20 ప్రపంచకప్ ఫైనల్లో రెండు కీలక వికెట్లు పడగొట్టి విజయంలో కీలకపాత్ర పోషించాడు.