calender_icon.png 12 July, 2025 | 10:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజాయితీ చాటుకున్న రోజా..

12-07-2025 12:00:00 AM

దొరికిన రూ. 4లక్షల డబ్బుల బ్యాగును పోలీసులకు అందజేత.....

కందుకూరు, జూలై 11 : తనకు దొరికిన రూ. 4లక్షల డబ్బుల బ్యాగును మానవత్వం తో పోలీసుల కు అందజేసిన ఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసు కుంది .సీఐ సీతారామ్ తెలిపిన వివరాల ప్రకారం గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో ఎంకె.విష్ణువర్ధన్ ఆమనగల్ మండలం విటాయిపల్లి వద్ద పనిచేసే వ్యక్తి....

జైత్వారం గ్రామంలోని రామ్ రెడ్డి పౌల్ట్రీ ఫారం నుంచి రూ. 4,01,400లను బ్యాగ్ లో తీస్కొని తన ద్విచక్ర వాహనంపైన ఆమనగల్లు మండలం విటాయిపల్లికి వెళ్తున్నాడు. మార్గమద్యలో తన డబ్బులు వున్న బ్యాగు ఎక్కడో పడిపోయింది.అది గమనించి విష్ణువర్ధన్ కి తెలియజేయగా వెంటనే మాజీ కౌ న్సిలర్ సుజాత రాములు తో కందుకూరు పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు.

దీంతో స్పం దించి తమ సిబ్బంది కృష్ణ,రమేష్ హోమ్ గార్డ్ లను ఆదేశించగా వారు జైత్వారం నుం డి అన్నీ సిసి కామెరాలు చెక్ చేసుకుంటూ కొత్తగూడ వైపు రావడం జరిగిందన్నారు.శుక్రవారం ఉదయం కొత్తగూడలోని శ్రీనికేతన్ హై స్కూల్ వద్ద కామెరాలు చెక్ చేస్తుండగా ఆ స్కూల్ అడ్మిన్ మేడమ్ బొద్దం రోజా గురువారం వారి స్కూల్ వద్ద ఒక బ్యాగ్ పడి ఉండటం చూసిన ఆమె అట్టి డబ్బుల బ్యాగును తీసుకొని జాగ్రత్తగా భద్రపరిచారన్నారు. 

అట్టి బ్యాగును వారు తిరిగి కందుకూరు పోలీసులకి అందజేశారు.అదే విషయాన్ని పాఠశాల యాజమాన్యం ఇం చార్జీ మధుసూదన్ రెడ్డి సైతం తెలిపారు. విష్ణువర్ధన్ వెంటనే స్పందించి పోలీస్ వారికి తెలుపగా పోలీస్ వారు తక్షణమే అట్టి డబ్బు లు వున్న బ్యాగ్ను విష్ణువర్ధన్ అందజేశారు. సందర్భంగా బాధితులు తమకు సహకారం అందించిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.