12-07-2025 12:00:00 AM
గొర్ల కోసం కట్టిన డిడి లను వాపస్ ఇవ్వాలి
తలకొండపల్లి,జులై 11:రాష్ట్రంలో గొర్ల కాపరులను కాంగ్రేస్ ప్రభుత్వం మోసం చేసిందని గొర్ల,మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర కమిటి సభ్యులు జిల్లెల్ల పెంటయ్య ఆరోపించా రు.తలకొండపల్లి మండల కేంద్రలో గొర్రెల,మేకల పెంపకం దారుల సంఘం జర్నల్ బాడి సమావేశం శుక్రవారం జరిగిం ది.ఈ సమావేశానికి సంఘం రాష్ట్ర కమిటి సభ్యులు పెంట య్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పెంట య్య మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రేస్ ప్రభుత్వం అదికారం లోకి వస్తే గొర్ల కాపరులు కట్టిన డబ్బులతో పాటు రూ.2లక్ష లు ఇస్తామని మ్యానిఫెస్టోలో పెట్టి అదికారాం లోకి వచ్చాక విస్మరించారని దుయ్యబట్టారు.గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలోని గొర్ల,మేకల పెంపకం దారులకు సబ్సిడి పై గోర్లు పంపిణీ చేసిందని చెప్పారు.అందులో కొందరికి ప్రభుత్వం మారడంతో గోర్లు అందలేదన్నారు.
గతంలో గొర్ల లబ్దిదారులు రూ.43,750 చొప్పున డీడీ ద్వార ప్రభుత్వానికి కట్టా రన్నారు. కాంగ్రేస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హా మీమేరకు గొర్ల కాపరులు కట్టిన డబ్బులను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం డీడీలను కొందరికి ఇచ్చి మరికొందరికి ఇవ్వాకుండా సతాయిస్తున్నారని ఆరోపించారు.
రా ష్ట్రంలో కాంగ్రేస్ ప్రభుత్వం అదికారం లోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు గొర్లకు నట్టుల నివారణ మందు పంపిణీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైన ప్రభు త్వం స్పందించి గొర్ల పంపకం లబ్దిదారులు కట్టిన డిడిలు వా పస్ ఇచ్చేవిదంగా చర్యలు తీసుకోవాలని
పెంటయ్య విజ్ఞప్తి చేశారు.ఈ నెల 13న మండల కేంద్రంలోని పోచమ్మ గుడి వద్ద మండల కమిటి సమావేశం ఉంటుందని సమావేశానికి అంద రు హాజరై విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మల్లయ్య, భద్రాచలం,తిరుపతి,కటికెల శేఖర్, జంగ య్య, శ్రీను లు పాల్గొన్నారు.