16-09-2025 10:25:21 PM
మేడిపల్లి,(విజయక్రాంతి): మేడిపల్లి పరిధిలోని శ్రీ వీర అంజనేయుల ఆలయ కమిటీ ఛైర్మన్ రామ్ రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ డైరెక్టర్లతో రాబోయే నవరాత్రి, బతుకమ్మ ఉత్సవ ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. మాజీ మేయర్ అమర్ సింగ్, మాజీ కార్పొరేటర్లు, ఆలయ కమిటీతో కలిసి పీర్జాదిగూడ మున్సిపల్ కమిషనర్ త్రిలేశ్వర్ రావుకు నవరాత్రి బతుకమ్మ పండుగల ఏర్పాట్ల కోసం వినతి పత్రం అందజేశారు. పండుగల ఏర్పాట్లకు అవసరమైన ప్రదేశాలను గుర్తించి, లైటింగ్, త్రాగునీరు, ప్రజలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరారు. అందుకు కమిషనర్ సానుకూలంగా స్పందించి అన్ని ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.