20 April, 2026 | 2:33 AM

రిజర్వేషన్లకు ఆరెస్సెస్ వ్యతిరేకం కాదు

29-04-2024 12:33 AM

ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్

హైదరాబాద్/ మహేశ్వరం, ఏప్రిల్ 28 ( విజయక్రాంతి): దేశంలో కొనసాగుతున్న రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమంటూ ఓ వీడియో వైరల్ అవుతోందని, ఇది అసత్య ప్రచారమని తెలిపారు. సమాజంలో అసమానతలు తొలగే వరకు రిజర్వేషన్ల కొనసాగింపు ఉండాల్సిందేనని చెప్పారు. హైదరాబాద్ నాదర్‌గుల్‌లో విద్యాభారతి విజ్ఞాన కేంద్రం ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఎన్నికలు జరుగుతున్న సందర్భం చూసి తమపై తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని భగవత్ మండిపడ్డారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా తప్పుడు వీడియోలను సృష్టించి ఆరెస్సెస్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమా జంలో వివాదాలు, ఉద్రిక్తతలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేయవద్దని, మంచి కోసం వాడాలని హితవు పలికారు. ఈ కార్యక్రమానికి త్రిదండి చినజీయర్‌స్వామి కూడా హాజరయ్యారు.