23-05-2025 12:00:00 AM
కుత్బుల్లాపూర్, మే 22(విజయ క్రాంతి) : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కుత్బుల్లాపూర్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి నల్ల జై శంకర్ గౌడ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా హనుమాన్ ఆలయాన్ని సంద ర్శించి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆయన మా ట్లాడుతూ హనుమాన్ భక్తి, ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కట్టుబడాలని పిలు పునిచ్చారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్త మండలి అధ్యక్షులు, సభ్యులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా హనుమాన్ జయంతి
మేడ్చల్, మే 22(విజయ క్రాంతి): మేడ్చల్ మండలం కోడూరు గ్రామం లో హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహించా రు. పురోహితులు గణపతి శర్మ, సంప త్ శర్మ, వెంకటేష్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, గణపతి హోమం, అభిషేకాలు, సింధూర లేపనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. పూజలో కందుకూరు సాయికుమార్ దంపతులు, గూడూరు శ్రీధర్ రెడ్డి దంప తులు పాల్గొన్నారు. సోమేశ్ యాదవ్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.