16 April, 2026 | 11:21 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

నిజాయతీ చాటుకున్న ఆర్టీసీ సిబ్బంది

31-05-2025 12:25 AM

-  రూ.19 లక్షల విలువైన వస్తువులు అందజేత

-  సిబ్బందిని అభినందించిన సంస్థ ఎండీ సజ్జనార్

హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): విధి నిర్వహణలో టీజీఎస్‌ఆర్టీసీ సిబ్బంది నిజాయతీ చాటుకున్నారు. బస్సుల్లో పొగొట్టుకున్న రూ.19 లక్షల విలువైన వస్తువులను తిరిగి అప్పగించారు.

ఈ నెల 25న సూర్యాపేట- బస్సులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికురాలు బ్యాగ్‌ను  బస్సులో మరిచిపోగా, ఆ  బ్యాగ్‌ను కండక్టర్ అంజయ్య, డ్రైవర్ యాకుబ్ పాషా గుర్తించి సూర్యాపేట డిపోలో అందించారు. అందులో రూ.6 లక్షల విలువైన ఆభరణాలున్నాయి. ఇంకో ఘటనలో.. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ పుష్పక్ బస్సులో ఒక ప్రయాణికురాలు రూ.8 లక్షల విలువైన బంగారు ఆభరణాలతో కూడిన బ్యాగ్‌ను మరిచిపోయారు.

అల్విన్ క్రాస్ రోడ్ వద్ద ఆ బ్యాగ్‌ను గుర్తించిన డ్రైవర్ ముబిన్ మియాపూర్ -2 డిపో అధికారులకు హ్యాండోవర్ చేశారు. అంతేకాకుండా మరో ఎయిర్‌పోర్ట్ బస్సులో శిల్పారామం వద్ద  ఒక ప్రయాణికుడు బ్యాగ్‌ను మరిచిపోగా, అందులో రూ.5 లక్షల విలువైన వస్తువులు ఉన్నాయి. గుర్తించిన డ్రైవర్ రమేశ్, అధికారుల సమక్షంలో ప్రయాణికుడికి అందజేశారు.

ఈ నేపథ్యంలో మానవత్వం చాటుకున్న ఆర్టీసీ సిబ్బంది కే అంజయ్య, యాకుబ్ పాషా, ముబీన్,  మేశ్‌ను టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనర్ అభినందించారు. వారందరినీ హైదరాబాద్ బస్ భవన్‌కు పిలుపించి ఉన్నతాధికారులతో కలిసి సన్మానించారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెకర్లు మునిశేఖర్, వెంకన్న, సీటీఎం (కమర్సియల్) శ్రీధర్, సీపీఎం ఉషాదేవి తదితరులు పాల్గొన్నారు.