calender_icon.png 15 December, 2025 | 8:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుల్తానాబాద్ లో శివుడికి ఘనంగా రుద్రాభిషేకం..

15-12-2025 05:42:34 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ పట్టణంలోని పాత బజార్ లో గల శివాలయంలో సోమవారము ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని అల్లంకి ఆనందం సావిత్రి, సురేష్ స్వప్న దంపతులు, కాసం నాగరాజు సరిత దంపతులు స్వామివారికి పలు రకాల పండ్లతో రుద్రాభిషేకం ఘనంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమం శివాలయం చైర్మన్ అల్లంకి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ అర్చకులు వల్ల కొండ మఠం మహేష్ దంపతులచే ప్రత్యేక పూజలు చేయించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, శివాలయం భక్త బృందం పాల్గొన్నారు.