calender_icon.png 15 December, 2025 | 8:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్‌పై బీఆర్‌ఎస్ నేతల వినతి

15-12-2025 05:45:55 PM

రామచంద్రపురం: జీహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్ నేపథ్యంలో పటాన్‌చెరు నియోజకవర్గంలో ఏర్పడుతున్న సమస్యలపై పటాన్‌చెరు బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి, భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి శేరిలింగంపల్లి జోన్ జోనల్ కమిషనర్ హేమంత్ ని, అనంతరం జీహెచ్ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ శ్రీనివాస్ ని కలిశారు. ఈ సందర్భంగా విద్యుత్‌నగర్ కాలనీ విభజన, వెలిమల గ్రామాన్ని తెల్లాపూర్ డివిజన్‌లో చేర్చడం, బొల్లారం శేరిలింగంపల్లి జోన్‌లో కొనసాగించడం, అమీన్‌పూర్, తెల్లాపూర్–ముత్తంగి ప్రాంతాల పునర్విభజనతో పాటు ప్రత్యేక పటాన్‌చెరు జోనల్ కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతిపాదనలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పలు మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.