calender_icon.png 22 July, 2025 | 5:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుడుంబాతో జీవితాలు నాశనం..!

22-07-2025 12:53:11 AM

బెల్లంపల్లి రూరల్ సీఐ అనూక్

బెల్లంపల్లి అర్బన్, జూలై 21: జీవనాధా రం కోసం గుడుంబా, ఇతర మాదకద్ర వ్యాలను ఆశ్రయిస్తే జీవితాలు నాశనం అవు తాయని బెల్లంపల్లి రూరల్ సిఐ అనుక్ అన్నారు. బెల్లంపల్లి మండలం బట్వాన్ పల్లి గ్రామంలో సోమవారం పోలీసులు, అబ్కారి శాఖ కలసి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. గ్రామంలో 31 టూ వీలర్లు, 3 ఆటోలతో పాటు నాయిని లచ్చయ్య, దల్యా మల్వోతూ వద్ద లభించిన 15 లీటర్ల గుడుంబాను సీజ్ చేశారు. తనిఖీలో దొరికిన 200 లీటర్ల బెల్లం పానకంను ధ్వంసం చేశా రు.

ఈ సందర్భంగా సీఐ అనుక్  మాట్లాడు తూ.. గుడుంబాను ఎవరూ తయారు చేయో ద్దనీ, తాగోద్దన్నారు. దాని వల్ల ఆరోగ్యం నాశనం అవుతుందని సూచించారు. కుటుం బ ఆర్థిక పరిస్థితులు దిగజారడం జరు గుతోందనీ, పిల్లలు చదువు కోకుండా సమా జంలో పనికిరాని వారవుతారన్నారు. గం జాయిని సేవించడం, అమ్మడం,  ట్రాన్స్ పోర్ట్ చేయడం చట్టరీత్య నేరమన్నారు.

వాహనాలకు అన్నిరకాల డాక్యుమెంట్స్ ఉండేలా చూసుకోవాలనీ, మైనర్లు వాహనా లు నడపవద్దని, సైబర్ నేరాలు, మూడ నమ్మకాల వల్ల  జరిగే అనర్ధాలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో గురీజాల ఎస్సై రమేష్, కన్నెపల్లి ఎస్సై భాస్కర్, భీమిని ఎస్‌ఐ విజయ్, బెల్లంపల్లి వన్ టౌన్ ఎస్సై రాకేష్, ఏఎస్సైలు, హెచ్‌సీలు పాల్గొన్నారు.