16-12-2025 12:52:34 AM
మంజూరైన నిధులు వారి వ్యక్తిగత సొత్తుకాదు
రాజకీయ పరిపక్యతలేనివారి మాటలు హాస్యాస్పదం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని
లక్ష్మీదేవిపల్లి మండలంలో కూనంనేని విస్తృత పర్యటన
లక్ష్మీదేవిపల్లి/భద్రాద్రి కొత్తగూడెం డిసెంబర్ 15 (విజయక్రాంతి) : కమ్యూనిస్టు పార్టీ ప్రజా ప్రతినిధులతోని గ్రామీణాభివృద్ధి, స మస్యల పరిస్కారం సాధ్యమవుతుందని సిపి ఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నా రు. గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని అశోక్ నగర్ కాలనీ, శ్రీనగర్ కాల నీ, సీతారాంపురం, వేపలగడ్డ, లాలుతండా, రేగళ్ల, గ్రామపంచాయతీలో అయన విస్తృతంగా పర్యటించారు.
గ్రామ సెంటర్లలో జరి గిన సమావేశాల్లో అయన మాట్లాడుతూ లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని ప్రజా సమస్యలను ముందస్తుగానే గుర్తించి పరిష్కరిం చామని, ప్రధానంగా వివిధ పథకాల్లో రోడ్లు, డ్రైన్లు, అంగన్వాడీ, పంచాయతీల భవనాలు నిర్మాణాలు పూర్తిచేశామని, మరికొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసి అధికారులకు అందిం చామన్నారు. ఓట్లకోసం కొందరు వ్యక్తులు ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, వీరి మాటల్లో రాజకీయ పరిపక్వత లేదన్నారు.
నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి నిధులు వారి వ్యక్తిగత సొత్తుకాదని, తమ ఇంటి ఖజానా నుంచి నిధులు మంజూరు చేయలేదని గుర్తుంచుకోవాలన్నారు. రెండో దఫా గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు సిపిఐని ఆదరించారని, ఇది నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధికి, సంక్షేమ పథకాల అమలుకు నిదర్శనమని, మూడో దఫాలో లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్ మండలాల్లో జరిగే గ్రామపంచాయతీ ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థులను గెలిపించి మరింత అభివృద్ధికి తోడ్పాటునందించాలని కోరా రు.
కార్యక్రమంలో నాయకులు చంద్రగిరి శ్రీనివాసరావు, దీటి లక్ష్మిపతి, దారా శ్రీనివాస్, నూనావత్ గోవిందు, సపావట్ రవి, పరుపర్తి, రాజు, కంటెం సత్యనారాయణ, శేఖర్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.