18-08-2025 12:00:00 AM
ముషీరాబాద్, ఆగస్టు 17 (విజయక్రాంతి): అర్.ఎం పి,పి ఎం పి గ్రామీణ వైద్యులకు గుర్తింపు కల్పించాలనే డిమాండ్ ను సాధించుకునే భాగస్వామ్యంలో భాగంగా గ్రామీణ వైద్యుల పరిరక్షణ, గౌర వాన్ని ఐక్యతతో కాపాడుకోవాలని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.
హైదరాబాద్ బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ‘మన హెల్త్ ఇండియా, విజ్ఞాన దర్శిని‘ ఆధ్వర్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతంలోని మురికివాడల్లో వివిధ రాష్ట్రాల్లో గ్రామీణ వైద్యులు నిర్వహించబోయే వైద్యసేవల గురించి ఆర్‌ఎంపి, పీఎంపీ ఉమ్మడి సంఘాల ప్రతినిధులతో కలిసి భవిష్యత్తులో గ్రామీణ వైద్యుల వ్యవస్థ రక్షణ కోసం ఆర్‌ఎంపి, పీఎంపీలపై జరుగుతున్న దాడులు కేసులపై చర్చ కార్యక్రమాన్ని నిర్వ హించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన ఎమ్మెల్సీ, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండ రామ్, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్ధ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ఆచరణలోకి రాలేదని, సమస్య ఏంటంటే ఆచరణలోకి ఎందుకు రావడం లేదంటే వారు వైద్యులే కాదని, కొంత మంది చట్ట పరిధిలో వైద్యం అందించకపోవడం అనే రకరకాలైన కారణాలు ఇలాంటి చాలా ఆక్షేపణలు ఉన్నాయన్నారు.
ఈ జీవోను ఆచరణలో పెట్టే సందర్భంలో చాలా ఓపిగ్గా ప్రయత్నం చేయాలని సూచించారు. ఈ క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే డాక్టర్లతో వైరుధ్యం లేదని స్పష్టతగా ఉండాలని అన్నారు. అదే విధంగా అర్హతకు మించి వైద్యం చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రులకు పంపించాలని సూచించారు. మాజీ ఎమ్మెల్సీ టీ.డి జనార్ధన్ మాట్లాడుతూ.. కర్ణాటక, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఆర్‌ఎంపి, పిఎంపీలు శిక్షణ పొంది సర్టిఫికెట్ సర్టిఫికెట్ ఇచ్చే క్రమంలో ఆగిపోవడం జరిగిందన్నారు.
ఎలాంటి శిక్షణను పొందకుండా కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని అన్నారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఆర్‌ఎంపి, పీఎంపీల సమస్యల పట్ల కేంద్ర ప్రభుత్వానికి సరైన విధంగా సమస్యను నివేదించేందుకు అందుకు అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేసి, చట్టబద్ధ గుర్తింపు కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఆర్‌ఎంపీ పీఎంపీ వైద్యుల ఐక్యతగా ఉండాలన్నారు.
అదేవిధంగా ఎలాంటి అర్హతకు మించిన వైద్య తప్పులకు ఆస్కారం ఇవ్వకుండా వైద్య సేవలు అందించి ఐకమత్యతో ఉండాలన్నారు. ఈ కార్యక్రమములో విజ్ఞాన దర్శిని రమేష్, హెల్త్ జర్నలిస్ట్ రాజేందర్ రెడ్డి, గుడివాడ మున్సిపల్ చైర్ పర్సన్ ప్రసాద్, వివిధ ఉమ్మడి రాష్ట్రాల ఆర్‌ఎంపి పిఎంపి సంఘాల అధ్యక్షులు సి.ఎస్.రావు, టీవీ రాజు, గణపతి రావు, నాగేశ్వరరావు,కర్ణాటక కత్తి మణి, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.