18-08-2025 12:00:00 AM
ముషీరాబాద్, ఆగస్టు 17(విజయక్రాంతి): చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కేంద్ర ప్రభుత్వ రిటైర్ ఎంప్లాయ్ ఇంట్లో జరిగిన చోరీ కేసును 48 గంటల్లోనే చిక్కడపల్లి పోలీసులు చోరీ కేసును చేధించా రు. ఈ సందర్భంగా ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 25 తులాల బంగారు నగలు, 23 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి వెల్లడించారు.
ఈ మేరకు ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సెంట్రల్ జోన్ అడిషనల్ డీసీపీ ఆనంద్, చిక్కడపల్లి ఏసిపి ఎల్ రమేష్ కుమార్, ఇన్‌స్పెక్టర్ రాజు నాయక్ లతో కలిసి డిసిపి శిల్పవల్లి మాట్లాడుతూ చిక్కడపల్లి పిఎస్ పరిధిలోని వివేక్ నగర్ లోని దిట్ట కవి ఎంక్లెవ్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి లక్ష్మీనారాయణ ఇంట్లో ఆగస్టు15వ తేదీన తెల్లవారు జామున గుర్తు తెలియని దుండగులు చోరీ చేసి 35 తులాల బంగారు నగలు, 35 వేల నగదు చోరీ చేసిన విషయం విధితమే.
బాధితులు లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని క్రైమ్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు బృందాలుగా విడిపోయి సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించినట్లు డీసీపీ శిల్పవల్లి వెల్లడించారు. కర్ణాటక హుబ్లీకి చెందిన బ్రూస్లీ కొంపల్లి లో నివాసం ఉంటున్నాడు. ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన సాయి కుమార్ తో జైల్లో పరిచయం ఏర్పడిందని వివరించారు.
వీరిపై హైదరాబాద్, రాచకొండ సైబరాబాద్, తెలంగాణలో బ్రూస్లీ అనే కర్ణాటక చెందిన వ్యక్తిపై తెలంగాణ, ఏపీ, కర్ణాటకలో 64 కేసులు, పాల్వంచకు చెందిన సాయికుమార్ పై తెలంగాణ, ఏపీలో 57 కేసులు బైక్ దొంగతనంతో పాటు హౌస్ బ్రేకింగ్ కేసులు నమోదయ్యాయి. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ తెలంగాణలో మొత్తం 57 కేసులు ఉన్నాయని తెలిపారు. 48 గంటల్లోనే ఈ కేసును ఛేదించిన పోలీసులను డిసిపి శిల్పవల్లి అభినందించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబం సభ్యులు, స్థానికులు కృతజ్ఞతలు తెలియ చేశారు.