22-05-2025 07:20:07 PM
పాల్గొన్న రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): పాల్వంచ కేటీపీఎస్ లోని రాధాకృష్ణ దేవాలయంలో హనుమాన్ దీక్షపరులు ఇరుముడులు కట్టుకొని కొండగట్టు బయలుదేరి వెళ్లారు. హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసుకున్న అనంతరం దీక్షపరులు ఇరుముడులు కట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు(Kotwala Srinivasa Rao) పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన అన్నదానం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గురు స్వాములు శివరామకృష్ణ, బాలాజీ, నరసింహ, రమేష్, అశోక్, ప్రతాప్, తిరుపతి, దుర్గాప్రసాద్, శేషు, ప్రన్విత్, ఉపేందర్, శశి నందన్, ఉపేందర్ స్వామి, కాంగ్రెస్ నాయకులు సందు ప్రభాకర్, కేసులాల్ నాయక్, కందుకూరి రాము, ఉండేటి శాంతి వర్ధన్, పులి సత్యనారాయణ, మాలోత్ కోటి నాయక్ తదితరులు పాల్గొన్నారు.