10-05-2025 01:08:08 AM
తిమ్మాపూర్ మే 9 (విజయక్రాంతి): తిమ్మాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా సదన్ కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. తిమ్మాపూర్ లో ఇంతకుముందు పనిచేసిన కర్రే స్వామి హైదరాబాద్ ఐజి కి అటాచ్ అయ్యారు.
సదన్ కుమార్ ఇటీవల మానకొండూర్ లో విధులు నిర్వహించి సిరిసిల్ల సిసిఎస్ కు బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో సీఐ ల బదిలీలలో భాగంగా శుక్రవారం సదన్ కుమార్ తిమ్మాపూర్ సీఐగా బాధ్యతలు చేపట్టగా ఎల్‌ఎండీఎస్‌ఐ వివేక్, శిక్షణలో భాగంగా విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ క్రాంతి కుమార్, లతోపాటు సిబ్బంది పుష్పగుచ్చం అందచేసి శుభాకాంక్షలు తెలిపారు.