calender_icon.png 29 September, 2025 | 5:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ నిదర్శనం

29-09-2025 03:45:22 PM

మాజీ జెడ్పి చైర్ పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు

తుంగతుర్తి,(విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు మహిళలు ఇష్టపడే పండుగ బతుకమ్మ అని మాజీ జెడ్పి చైర్పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని తూర్పు గూడెం గ్రామంలో సోమవారం సద్దుల బతుకమ్మ పండుగలో భాగంగా తంగేడి పూలు. బంతి, చామంతి గులాబి పూల సమ్మేళనంతో మహిళలతో కలిసి, బతుకమ్మను పేర్చి, మహిళలకు ప్రత్యేకంగా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి మహిళ ఇష్టపడే పండుగ బతుకమ్మ అన్నారు. తెలంగాణ రాష్ట్రమే, బతుకమ్మ పండుగ ఖ్యాతి ప్రపంచాన్ని చాటిందని అన్నారు.