29-09-2025 04:55:24 PM
వేములవాడ టౌన్ (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఈవో ఎల్. రమాదేవి అగ్రహారం జోడు ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, ఆలయ అర్చకులు ఏల్.రమాదేవ వేదోక్త ఆశీర్వచనం అందజేశారు. ఈవో వెంట దేవస్థానం పర్యవేక్షకులు విజయ్, అకౌంట్స్ అడ్వైజర్ ఆగమరావు ఉన్నారు.