29-09-2025 04:52:59 PM
నిర్మల్ (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచడానికి ఆమ్ ఆద్మీ పార్టీ స్వాగతిస్తుందని వచ్చే ఎన్నికల్లో బీసీలకు టికెట్లు కేటాయించేందుకు పార్టీ సిద్ధంగా ఉందని జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో పార్టీ తరఫున అభ్యర్థులను ఎంపిక చేసిన ధరలో ప్రకటిస్తామని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు జిల్లా కమిటీ కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు వినోద్ శ్రీనివాస్ పాల్గొన్నారు.