29-09-2025 05:15:32 PM
రాజన్న ఆలయ ఈవో రమాదేవి..
రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, వేములవాడ ఈవో ఎల్. రమాదేవి జిల్లా అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈవో ఆలయ తరఫున స్వామి వారి ప్రసాదాన్ని అడిషనల్ కలెక్టర్ అందజేయగా, ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన మున్నగు విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆలయ గోశాల పర్యవేక్షకులు విజయ్, అకౌంట్స్ అడ్వైజర్ ఆగమరావు, అర్చక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.