calender_icon.png 29 September, 2025 | 6:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బతుకమ్మ వేడుకలకు మహిళలు సిద్ధం

29-09-2025 04:57:55 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా సోమవారం తీరొక్క పూలతో ఉత్సవాలకు మహిళలు రంగురంగుల బతుకమ్మలను సిద్ధం చేస్తున్నారు. గునుగు, తంగేడు, బంతి, చామంతి, టేకు పూలు, కట్ల పూలు, సీతమ్మ జడ పూలు, తామెర పూలతో పాటు ప్రకృతిలో సహజంగా లభించే అన్ని రకాల పూలతో బతుకమ్మలను అందంగా ముస్తాబు చేస్తున్నారు. తెలంగాణలో మహిళల ఆత్మగౌరవ ప్రతీక గా భావించే ఈ పండుగను ఈసారి మరింత గొప్పగా నిర్వహించేందుకు ప్రతి ఇంట్లో మహిళలు సంసిద్ధమయ్యారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఏడు మండలాలలో సోమవారం రాత్రి సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా జరిపేందుకు మహిళలందరూ ఉత్సాహం చూపుతున్నారు.

బెల్లంపల్లి కార్మిక కాలనీలతో పాటు పరిసర గ్రామాలలో కూడా సద్దుల బతుకమ్మ వేడుకల ఏర్పాట్లు చేపట్టారు. పోచమ్మ చెరువు వద్ద బతుకమ్మల నిమజ్జనం కోసం మున్సిపల్ యంత్రాంగం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. బెల్లంపల్లి మండల పరిధిలోని అన్ని గ్రామాలలో గల చెరువుల వద్ద బతుకమ్మ నిమజ్జనం కోసం స్థానిక అధికారులు ఏర్పాటు చేశారు. బెల్లంపల్లి పట్టణంలోని ఏఎంసి నెంబర్ టు గ్రౌండ్ లో నిర్వహించే బతుకమ్మ వేడుకలలో మందమర్రి జిఎం దంపతులు ఎన్. శ్రీవాణి రాధాకృష్ణలు హాజరుకానున్నారు. పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి, మార్కండేయ ఆలయాల్లో బతుకమ్మ వేడుకల కోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు.