29-09-2025 04:28:17 PM
శ్రీ మహాలక్ష్మి ఆలయంలో ఘనంగా చక్రీ భజన
శరన్నవరాత్రుల్లో తొమ్మిది రోజులపాటు నిరంతర భజన
విశేష సంఖ్యలో హాజరవుతున్న భక్తులు
మంథని (విజయక్రాంతి): శరన్నవరాత్రుల్లో భాగంగా మంథని పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పట్టణ పురవీధుల గుండా సోమవారం ఘనంగా ఊరేగించారు. వాడవాడల్లో ఉట్టి కట్టి గోపాల కార్యక్రమంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఊరేగింపు సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగింది. తమ్మిచెరువు కట్టప్రముఖ క్రికెట్ కామెంటటర్లు మహావాది సుధీర్, విజయ్ లు భక్తి పాటలతో డ్యాన్స్ చేస్తూ అందరిని అలరించారు. దేవాలయంలో చక్రీ భజన కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. నవరాత్రుల్లో భాగంగా తొమ్మిది రోజులపాటు నిరంతరం భజన కార్యక్రమం నిర్వహించడం ఈ ఆలయం యొక్క ఆనవాయితీగా చెప్పుకోవచ్చు. చక్రిభజన కార్యక్రమములో అన్ని వాడలకు చెందిన భజన పరులు రాత్రి 8 గంటల నుండి 11 గంటల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంథని పట్టణంలోని అన్ని వాడలకు చెందిన భజన బృందాలు పాలీల వాయిదా కార్యక్రమంలో పాల్గొన్నారు.
తొమ్మిది రోజులపాటు తాళం, గానం ఆపకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఒక సంప్రదాయం. ప్రతి భజన మండలికి రోజు రెండు గంటలు చొప్పున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాదిమంది భక్తులు తరలివస్తున్నారు. ఎంతో విశిష్టత కలిగిన శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు భక్తుల పాలిట కొంగు బంగారంగా భక్తుల్లో ఎంతో విశ్వాసం నెలకొంది. నియమ నిష్టలతో అమ్మవారిని దర్శించుకుని కానుకలు సమర్పిస్తే అంతా శుభం జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం, ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో తొమ్మిది రోజులపాటు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. అలాగే చివరి రోజున అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పట్టణ పురవీధుల గుండా భక్తులు ఆటపాటలతో నిత్యాలతో కోలాటాలతో ఊరేగిస్తారు. అనంతరం చక్రి భజన కార్యక్రమం ఆలయంలో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తారు.