calender_icon.png 1 September, 2025 | 9:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి

31-08-2025 12:28:59 AM

-రౌడీ షీటర్ల కదలికలపై నిఘా పెట్టాలి

-పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్

-గణేశ్ నిమజ్జనం, బందోబస్తుపై ఉన్నత స్థాయి సమీక్ష

హైదరాబాద్ సిటిబ్యూరో, ఆగస్టు 30 (విజయక్రాంతి):గణేశ్ నిమజ్జన బందోబస్తుపై నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్  సీవీ ఆనంద్, అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గణేశ్ ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు, నిమజ్జనం సజావుగా సాగేందుకు తీసుకోవా ల్సిన భద్రతా చర్యలపై కమిషనర్ అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు.

పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. విగ్రహాల దొంగత నాలు వంటి నేరాలను నివారించడానికి స్థానిక పోలీసులు, వలంటీర్లు నిరంతర నిఘా ఉంచాలని కోరా రు.  సమస్యలు సృష్టించే వ్యక్తులు, రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశిం చారు. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల నుంచి వచ్చే విగ్రహాల వాహనాలకు సరైన పోలీసు ఎస్కార్ట్ ఉండేలా చూడాలని తెలిపారు.

రాత్రిపూట విగ్రహాల వద్ద నిర్వాహకులు లేదా వాలంటీర్లు తప్పనిసరిగా ఉండాలని సూచించారు.గతంలో గణేశ్ విగ్రహాల నిమజ్జనం సమయంలో జరిగిన లోటుపాట్లు, శాం తిభద్రతల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. విగ్రహాలను త్వరగా నిమజ్జనం చేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికపై చర్చించి, అధికారులకు తగిన సూచనలు అందించారు.సమావేశంలో నార్త్ జోన్ డీసీపీ  ఎస్. రశ్మి పెరుమాల్, డీసీపీ   కె. అపూ ర్వరావు, డీసీపీ  బీకే రాహుల్ హెగ్డే, డీసీపీ  వైవీఎస్. సుధీంద్ర, అడిషనల్ డీసీపీలు, నార్త్ జోన్‌లోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు పాల్గొన్నారు.

గణేశ్ మండపాల తనిఖీ  

సమావేశం అనంతరం పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నార్త్ జోన్‌లోని ముఖ్యమైన గణేశ్ మండపాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండపాల నిర్వాహకులతో, వాలంటీర్లతో మాట్లాడారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మండప నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. గణేశ్ ఉత్సవాలు ప్రశాంత వాతా వరణంలో జరిగేందుకు అందరూ పోలీసులకు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.