calender_icon.png 11 May, 2025 | 6:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి

07-05-2025 12:00:00 AM

బీజేపీ చండూరు మండల అధ్యక్షుడు ముదిగొండ ఆంజనేయులు

గట్టుప్పల, మే 6: నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని బిజెపి మండల  అధ్యక్షులు ముదిగొండ ఆంజనేయులు ప్రభుత్వాన్ని కోరారు.  సోమవారం ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో నిరుపేదలకు అన్యాయం జరుగుతుందనినల్లగొండ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చండూరు పరిధిలోని వివిధ గ్రామాలలో అరులకు ఇవ్వకుండా అన రులకు ఎంపిక చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అధికార పార్టీ నాయకులు వారికి ఇష్టం వచ్చిన విధంగా ఇందిరమ్మ ఇండ్లు ఎంపిక చేస్తున్నారని, అధికార పార్టీ నాయకులు సైతం ఇందిరమ్మ ఇండ్లు వారికి కేటాయించుకొని పేద ప్రజలను గాలికి వదిలేస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వ అధికారులను ఇండ్లు కావాలని అడిగితే అధికార పార్టీ నాయకులు ఎవరు చెబితే వారి పేర్లు మాత్రమే వస్తాయని మా చేతిలో ఏమీ లేదని అంటున్నారని ఆయన అన్నారు.

మండలంలోని అన్ని గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అన్యాయం జరుగుతుందని, కావున ప్రభుత్వం స్పందించి రీ -వెరిఫికేషన్ చేసి అన్ని గ్రామాలలో పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఆయన రాష్ర్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.