16-08-2025 09:18:16 PM
వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలం(Valigonda Mandal)లోని వెలువర్తి క్లస్టర్ గ్రామానికి చెందిన వ్యవసాయ విస్తరణ అధికారి పులిపలుపుల సాయి ఉత్తమ ఏఈఓగా 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు చేతులమీదుగా ప్రశంసాపత్రం అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మండల ఏవో, ఏఈవోలు ఆయనను అభినందించారు.