16-08-2025 09:20:26 PM
డోంగ్లీ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి(Sub Collector Kiranmayi) సూచించారు. డోంగ్లి మండలంలోని లింబురువాడి వాగు పొంగిపొర్లుతూ రాకపోకలకు ఇబ్బందులు కలగడంతో శనివారం సబ్ కలెక్టర్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామస్థులతో మాట్లాడుతూ, అత్యవసర పరిస్థితులు ఉంటే తప్పా బయటకు వెళ్లకూడదని సూచించారు. వరద ప్రవాహాన్ని అంచనా వేయకుండా వాగులలో ప్రయాణించవద్దని చెప్పారు. నీటి ప్రవాహాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయా గ్రామాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు ఇబ్బందులు కాకుండా చూడాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆమె వెంట ఆర్ఐ సాయిబాబా వివిధ శాఖల అధికారులు ఉన్నారు.