calender_icon.png 13 June, 2025 | 12:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా సైదిరెడ్డి జన్మదిన వేడుకలు

12-06-2025 12:21:42 PM

నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్.. మందడి సైదిరెడ్డి జన్మదిన సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోని  కేబీఆర్ క్యాంపు కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా  నలగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి కేక్ కట్ చేసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, మాజీ కౌన్సిలర్ లు రావుల శ్రీనివాస రెడ్డి, మారగోని గణేష్,బొజ్జ వెంకన్న, దొడ్డి రమేష్, మెండు చంద్రశేఖర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.