30-08-2024 01:55:35 AM
మంచిర్యాల, ఆగస్టు 29 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంట (సాగికుంట) చెరువు కబ్జాదారుల చేతుల్లో పడి కూడుకుపోతుంది. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు చెరువు హద్దులను గుర్తించి మార్కింగ్, జియోటాగింగ్ చేశారు. ప్రభుత్వ రికార్డులు, కాగితాల్లో చెరువులు, కు ంటలు ఉంటున్నా.. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే కనిపించడం లేదు. మరోవైపు ఫుల్ ట్యాంకు లెవల్ (ఎఫ్‌టీఎల్) నిబంధనలకు విరుద్ధం గా చెరువుల పరిసరాల్లో యథేచ్చగా నిర్మాణాలు చేపడుతున్నారు.
మట్టి పోస్తూ చెరువు ఆక్రమణ
సాయికుంట చెరువుపై కన్నేసిన కబ్జారాయుళ్లు.. మట్టి నింపుతూ దానిని పూడ్చేస్తు న్నారు. 629 సర్వే నంబర్లో ఉన్న ఈ సాయికుంట చెరువు 8.17 ఎకరాలు ఉండి 41,27 7.6 క్యూబిక్ మీటర్ల నీటి సామర్థ్యం కలిగి ఉండేది. ప్రస్తుతం అది కబ్జాదారుల చేతుల్లో పడి విలవిలలాడుతోంది. ఇది వరకే ఈ చె రువు చుట్టూ హద్దులు ఏర్పాటు చేయగా క బ్జాదారులు హద్దురాళ్లను తొలగించి ఆక్రమిస్తున్నారు. ఇప్పటికే ఎకరానికిపైగా కబ్జాకు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. కబ్జా చే సేందుకు చెరువులో మట్టి నింపుతున్నారని వాపోయారు.
సుందరీకరణ పేరుతో కబ్జాలు
మున్సిపాలిటీ పాలక వర్గం ప్రతిపాదించి న సాయికుంట చెరువు సుందరీకరణ పను ల్లో భాగంగా చెరువు పూర్వహద్దులను వది లి కరకట్టలు పోవడం వల్ల ప్రభుత్వ ఆశయం దెబ్బతింటుంది. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, లంచాలకు మరిగిన అధికారులకు ఇది వరంగా మారింది. వార్డు కౌన్సి లర్ సహకారంతో కబ్జాదారులు యథేచ్ఛగా ఆక్రమణలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెరువులో ఏకంగా టిప్పర్లతోనే మట్టిని నింపుతూ ప్లాట్లుగా మార్చుకు ంటున్నా అధికారులు చూసీచూడనట్టు ఉంటున్నారు.
శిఖం భూమిని కాపాడాలని అధికారులకు వినతులు
సాయికుంట చెరువు శిఖం భూమిని క బ్జాదారుల నుంచి కాపాడాలని వేడుకుంటూ ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు అటు రె వెన్యూ, ఇటు మున్సిపల్, ఇరిగేషన్ అధికారులను వినతి పత్రాలు ఇస్తూ వేడుకుంటు న్నారు. గతంలో చెరువుపై విషయమై రెవె న్యూ, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేస్తే ఎఫ్‌టీఎల్ ఏర్పాటు చేసి శిఖం భూమిని వదిలేయడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు శిఖం భూమిని కబ్జా చేసి జోరుగా వెంచర్లు వేసి అక్రమవ్యాపారాలు జరుపుతున్నారు. అధికారులు విచారణ చేసి కబ్జాకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పలువురు కోరుతున్నారు.