calender_icon.png 17 August, 2025 | 1:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సలామే అనాలి..

08-08-2025 12:00:00 AM

యష్‌రాజ్ ఫిల్మ్ నిర్మాణం లో ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న చిత్రం ‘వార్ 2’. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా మేకర్స్ గురువారం ఈ సినిమా నుంచి ‘సలామే అనాలి’ అంటూ సాగే పాటకు సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేశారు. ‘రేయి పగలు ఏదైనా కానీ మనముంటే కాదా దివాళీ..’ అంటూ సాగుతోందీ పాట.

అయితే, ఈ పూర్తి గీతాన్ని చూడాలంటే సినిమా రిలీజ్ అయ్యేవరకూ ఆగాల్సిందేనని చిత్రబృందం చెబుతోంది. ఈ గ్లింప్స్‌లో ఎన్టీఆర్, హృతిక్‌ల వేసిన స్టెప్పుల్ని ఆకట్టుకున్నాయి. హిందీలో ‘జనాబ్ అలీ’ అంటూ సాగే ఈ పాటను ప్రీతమ్ స్వరపర్చారు. హిందీ సాహిత్యాన్ని అమితాబ్ భట్టాచార్య అందించగా సాచెట్ టాండన్, సాబ్ భట్టాచార్య ఆలపించారు.

తెలుగులో ‘సలామే అనాలి’ అంటూ సాగే ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించగా.. నకాష్ అజిజ్, యాజిన్ నిజార్ ఆలపించారు. ఇక బోస్కో లెస్లీ మార్టిస్ స్టెప్పుల్ని కంపోజ్ చేశారు. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళంలో విడుదల చేయనున్నారు.