calender_icon.png 17 August, 2025 | 9:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉండిపోవే నాతోనే..

08-08-2025 12:00:00 AM

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం ‘కిష్కిందపురి’లో నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి రచన దర్శకత్వం వహిస్తున్నారు. హర్రర్- మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. తాజాగా గురువారం మేకర్స్ ఫస్ట్ సింగిల్ ‘ఉండిపోవే నాతోనే..’ను విడుదల చేశారు. చైతన్ భరద్వాజ్ స్వరపరిచిన ఈ పాటలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ అద్భుత కెమిస్ట్రీతో ఆకట్టుకున్నారు.

జావేద్ అలీ పాడిన ఈ పాటకు పూర్ణాచారి సాహిత్యం అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. “చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ నచ్చే సినిమా ఇది. మంచి హారర్ మిస్టరీతో రూపొందించాం” అన్నారు. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. “ఇది చాలా స్పెషల్ సినిమా.

ఇందులో చాలా స్పెషల్ మూమెంట్స్ ఉంటాయి” అని చెప్పారు. దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి మాట్లాడుతూ.. ‘నేను చదువుకున్న కాలేజీలో ఈ సాంగ్‌ను ఆన్ చేయడం చాలా ఆనందంగా ఉంది’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.