calender_icon.png 17 August, 2025 | 5:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎవరూ ఎవర్నీ బలవంతపెట్టరు!

08-08-2025 12:00:00 AM

భారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం రష్మిక మందన్నా టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది. ఆమె నటించిన పుష్ప ఫ్రాంచైజీ సినిమాలు, యానిమల్, ఛావా.. ఇలా భారీ విజయం సాధించాయి. ఈ సినిమాల్లో ఆమె పాత్రకు ప్రశంసలు దక్కాయి. ఇండస్ట్రీకి వచ్చిన కొన్నేళ్లలోనే భారీ సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్న రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను చెప్పింది.

“పుష్ప’ శ్రీవల్లి, ‘ఛావా’ ఏసుబాయి పాత్రల ప్రభావం నా కెరీర్‌పై ఉంది. నా జీవితాన్ని మార్చేసిన క్యారెక్టర్స్ అవి. ఈ పాత్రలకు లభించిన స్పందన కారణంగా ఓ నటిగా నాపై నాకు పూర్తి నమ్మకం వచ్చింది” అని చెప్పు కొచ్చింది. పుష్ప సినిమాతో నేషనల్ క్రష్‌గా మారిన రష్మిక ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

అయితే అదే సమయంలో బాలీవుడ్‌లో తాను నటించిన పలు సినిమాలు ఆడకున్నప్పటికీ రణబీర్ కపూర్‌తో కలిసి చేసిన ‘యానిమల్’ మాత్రం హిందీలో రష్మికకు మరో లైఫ్ ఇచ్చింది. అయితే ఈ సినిమాలో తన పాత్రపై వచ్చిన విమర్శలను మాత్రం పట్టించుకోవద్దం టోంది రష్మిక. ‘సినిమాలు చూడాలని ఎవరూ ఎవరినీ బలవంతపెట్టరు. అందుకే అవి లైట్’ అని తెలిపింది. అంత విమర్శలొచ్చినా టాప్‌లో ఉన్న రష్మికను ఇటీవలి ‘కుబేర’ మాత్రం కాస్త నిరాశే మిగిల్చిం దని చెప్చొచ్చు.

వైవిధ్యమైన పాత్ర అని ఒప్పుకున్నప్పటికీ.. ఆ పాత్ర ప్రాధాన్యం ఎడిటింగ్‌లో తగ్గడం, ఆమె పాత్ర నేపథ్యంలోని ఓ పాటను సినిమా నుంచి తొలగించడం అభిమానులకూ నచ్చలేదు. ఇక ఇప్పుడు ఆమె మరోసారి ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

అదే కాకుండా హిందీ చిత్రం ‘థామా’ కూడా తనను నటిగా మరో స్థాయికి తీసుకెళ్తుందన్న రష్మిక నమ్మకంగా చెప్తోంది. ఈ రెండు సినిమా ల్లో రష్మిక పాత్రలు పూర్తిగా విభిన్నం. థామ సినిమాను ఆదిత్య సర్పోత్ దార్ తెరకెక్కిస్తున్నారు. ఇది అతీంద్రియ శక్తుల నేపథ్యం లో రూపొందనుంది. ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రానికి రాహుల్ దర్శకత్వం వహిస్తు న్నారు.