19-12-2025 04:29:32 PM
వాట్సాప్ కాల్స్ చేసి పోలీసులుగా చెప్పుకున్న ముఠా
డిజిటల్ అరెస్టు పేరుతో డబ్బు వసూలు
హైదరాబాద్: డిజిటల్ అరెస్టు(Digital Arrest) పేరుతో డబ్బులు కాజేసిన కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను కాకినాడ వాసులు సూరంపూడి చంద్రశేఖర్, వెంకటనవీన్ గా గుర్తించారు. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ. 59 లక్షలు కాజేశారు. మృద్ధిడికి వాట్సాప్ కాల్స్(WhatsApp calls) చేసిన ముఠా పోలీసులుగా చెప్పుకున్నారు. డిజిటల్ అరెస్టు అంటూ భయపెట్టి డబ్బులు వసూలు చేశారు. నిందితులు ఇప్పటి వరకు రూ. 8 కోట్లు కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. కాజేసిన డబ్బును షెల్ కంపెనీ ఖాతాల ద్వారా క్రిప్టో కరెన్సీగా(Cryptocurrency) మార్చుకుంటున్నారు. దేశవ్యాప్తంగా 65 సైబర్ కేసుల్లో నిందితుల పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు 15 కరెంట్ అకౌంట్లు సరఫరా చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 5 సెల్ ఫోన్లు, 10 డెబిట్ కార్డులు, చెక్ బుక్స్, పాన్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.